ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన గ్యాస్ పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో టపాసులను గుర్తించటంతో...బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

చిలకలూరిపేటలో పేలుడు... టపాసులే తయారీనే కారణమా !

By

Published : Oct 1, 2019, 8:41 PM IST

చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరు మహిళలు మృతిచెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే నాగార్జున ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రేకుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. చనిపోయిన వారి శరీర భాగాలు పక్కనే ఉన్న పార్కులో చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఇద్దరు మృతి... మరొకరి పరిస్థితి విషమం....
భారీ శబ్దంతో పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల వారు బాంబు పేలుడుగా భావించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నాగార్జున కుటుంబానికి సన్నిహితురాలైన దివ్య అక్కడికక్కడే చనిపోయింది. భార్య ఆదిలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నాగార్జున, కుమార్తె శృతి, నాయనమ్మ గురుస్వామిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

టపాసులు తయారీనే కారణమా...!
గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగానే ప్రమాదం జరిగిందని నాగార్జున కుటుంబ సభ్యులు చెబుతుండగా... సంఘటనాస్థలంలో టపాసులు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాణాసంచా తయారీ చేస్తుండగా పేలుడు సంభవించి ఉంటుందని...రెవెన్యూ, అధికారులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం అధారాలు సేకరిస్తోంది.

ఇవీ చూడండి-మచిలీపట్నంలో దారుణం...పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details