సిలిండర్ పేలి ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు - gas-blast at chilakauripeta
చిలకలూరిపేటలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే నాగార్జున అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదం జరిగింది. ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాల్యాయి.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన.. ఇద్దరిని బలి తీసుకుంది. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే నాగార్జున ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే వీరు గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు. లీకేజీని గుర్తించలేని కారణంగా... ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో దివ్య, ఆదిలక్ష్మి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో నాగార్జున తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. నాలుగేళ్ల శృతి, 70 ఏళ్ల గురుస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.