ధ్వంసమైన గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మరమ్మతులు
పోలకపాడు వద్ద ధ్వంసమైన గాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరమ్మతులు చేయించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
గాంధీ విగ్రహానికి స్వయంగా ఎమ్మెల్యే మరమ్మతులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకపాడు వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న గాంధీ విగ్రహం కాలుకు సిమెంట్‌తో మరమ్మతులు చేయించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.