ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులు, మహిళలను పెయిడ్​ ఆర్టిస్టులనే వారు సిగ్గుపడాలి'

శాంతియుతంగా నిరసన చేస్తే పోలీసులు దౌర్జన్యం చేశారని ఎంపీ గల్లా జయదేవ్​కు మందడం మహిళలు ఫిర్యాదు చేశారు. కేంద్రంతో సంప్రదించి అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

'రైతులు, మహిళలను పెయిడ్​ ఆర్టిస్టులనే వారు సిగ్గుపడాలి'
'రైతులు, మహిళలను పెయిడ్​ ఆర్టిస్టులనే వారు సిగ్గుపడాలి'

By

Published : Jan 6, 2020, 4:30 PM IST

మందడంలో రైతుల నిరసనకు ఎంపీ గల్లా జయదేవ్​ మద్దతు

మందడంలో రైతుల నిరసనకు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్​ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తే పోలీసులు దౌర్జన్యం చేశారని మహిళల ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయడమే కాకుండా కేసులు పెట్టారని మండిపడ్డారు. అమరావతిని కాపాడి తమ జీవితాలు నిలబెట్టాలని అన్నారు. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నేతలు సిగ్గుపడాలి

పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళలను కించపరిచేవారు సిగ్గుపడాలని ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజమెత్తారు. అభివృద్ధి అంటే రాజధానిని విభజించడం కాదన్నారు. విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం రాదన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్ర శ్నించారు. పార్లమెంటులో రాజధాని అంశంపై గట్టిగా పోరాడతామని గల్లా జయదేవ్‌ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

రాజధాని పై రైతుల పోరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details