ETV Bharat / city

రాజధాని పై రైతుల పోరు

amaravathi
amaravathi
author img

By

Published : Jan 6, 2020, 9:47 AM IST

Updated : Jan 6, 2020, 3:12 PM IST

14:20 January 06

అమరావతి రైతల మహా పాదయాత్ర ఉద్ధృతం

ఏకైక రాజధానిగా అమరావతినే కొసాగించాలంటూ...... అమరావతి రైతల మహా పాదయాత్ర ఉద్ధృతంగా సాగుతోంది. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.... రాజధాని వ్యవహారంలో న్యాయం చేయమని మాత్రమే అడుగుతున్నామంటూ..... తుల్లూరు నుంచి మందడం పాదయాత్రగా వెళ్లారు

14:20 January 06

​​​​​​​తారస్థాయికి చేరుతున్న రైతుల 'అమరావతి సాధన పోరాటం'

రాజధాని రైతుల అమరావతి సాధన పోరాటం...... తారస్థాయికి చేరుతోంది. టెంటు వేసుకుని నిరసన తెలిపేందుకు పోలీసుల నిరాకరణతో...... రైతులు సమష్టిగా తుళ్లూరు నుంచి మందడం మహా పాదయాత్ర చేస్తున్నారు. ఎటుచూసినా నిరసనకారులే కనిపిస్తున్న ఆ ప్రాంతంలో...... శాంతియుత నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

14:19 January 06

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై... మహిళలు తీవ్రఆగ్రహం

రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న తమను... పెయిడ్‌ ఆర్టిస్టులంటూ మాట్లాడిన SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై... మహిళలు తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. భూములిచ్చిన అన్నదాత రోడ్డుపై ఉంటే... సంఘీభావం తెలపాల్సింది పోయి... ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి వచ్చి... పెయిడ్‌ ఆర్టిస్టులెవరో నిరూపించాలని సవాల్‌ విసిరారు..

11:44 January 06

పోలీసులపై దాడి చేశామనే ప్రకటనను ఖండిస్తున్నాం: మందడం మహిళలు

ధర్నా చేస్తున్న మాపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు: మహిళలు
పెయిడ్‌ ఆర్టిస్టులంటే ఇకనుంచి సహించేది లేదు: మందడం మహిళలు
ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే తెలుస్తుంది: మహిళలు
రాజధాని ఉండటంలేదనే ఆందోళనతో గుండెలుపగిలి రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. -మహిళలు

11:43 January 06

విజయవాడ: అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ న్యాయవాదుల దీక్ష

అమరావతిలో హైకోర్టు ఉంచాలన్న బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు

నేటి నుంచి ఈ నెల 20 వరకు రిలే నిరాహారదీక్ష చేయనున్న న్యాయవాదులు

11:43 January 06

పోలీసులు సమర్థించుకొనే ప్రయత్నం

మందడంలో మహిళలపై దురుసుగా వ్యవహరించిన ఘటనలో... పోలీసులు సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆరోజు సమర్థంగా వ్యవహించకుంటే పరిస్థితి చేయి దాటిపోయి ఉండేదన్నారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులు సైతం గాయపడ్డారని చెప్పారు. శాంతియుత నిరసనలను అడ్డుకొనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇవాళ రాజధాని గ్రామాల్లో పాదయాత్రలకు అనుమతి లేదని అదనపు ఎస్పీ చక్రవర్తి స్పష్టం చేశారు.

11:43 January 06

రాజధాని రైతులకు మద్దతుగా బలంగా నిరసన గళం వినిపిస్తున్న ఎస్సీలు

రాజధాని రైతులకు మద్దతుగా ఎస్సీలు సైతం బలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ వెలగపూడి దళితవాడ నుంచి మందడం వరకూ వారంతా పాదయాత్ర చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి పాదయాత్రకు బయలుదేరారు. గత ప్రభుత్వం తలపెట్టిన అంబేద్కర్‌ స్మృతి వనాన్ని సైతం అదే ప్రాంతంలో పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. Bite......

10:28 January 06

వెలగపూడి దళితవాడ నుంచి అమరావతికి పాదయాత్ర

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేసే పోరాటంలో తామంతా ఐక్యంగా పోరాడతారని ఎస్టీలు తేల్చిచెప్పారు. వెలగపూడి 20వరోజు రిలే నిరాహారదీక్షలో భాగంగా దళితవాడలో స్థానికులు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం తలపెట్టిన అంబేద్కర్‌ స్మృతి వనాన్ని తమ ప్రాంతంలోనే అభివృద్దిచేయాలని ఎస్టీ రైతులు, రైతులు కూలీలు దానికోసం ఎంతకైనా పోరాడతామని తేల్చిచెప్పారు

09:48 January 06

మందడం మహిళలపై దౌర్జన్యానికి సంబంధించి పోలీసుల పొంతనలేని ప్రకటనలు

మహిళలను తప్పించే యత్నంలో దురుసుగా ప్రవర్తించారని మొన్న తెలిపిన పోలీసులు
మందడం మహిళలు కానిస్టేబుళ్లపై దాడి చేశారంటూ ఇవాళ ప్రకటన
కానిస్టేబుళ్లపై దాడి చేస్తే ఆరోజే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించిన మీడియా
మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసిన పోలీసులు

09:48 January 06

అమరావతి: మందడంలో పోలీసుల మీడియా సమావేశం

అమరావతి: మందడంలో పోలీసుల మీడియా సమావేశం
ఇవాళ రాజధాని గ్రామాల్లో పాదయాత్రకు అనుమతి లేదు: అదనపు ఎస్పీ
పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే: అదనపు ఎస్పీ చక్రవర్తి
అనుమతి లేకుండా ప్రతిరోజు రహదారిపై ధర్నాలు చేస్తున్నారు: చక్రవర్తి
నిరసన తెలిపే హక్కు ఉంటుంది కాని ఎదుటివారికి ఇబ్బంది పెట్టకూడదు: చక్రవర్తి

ఇవాళ సీడ్‌ యాక్సిస్ రోడ్డుపై పాదయాత్రకు ఎవరికీ అనుమతి లేదు: చక్రవర్తి

09:47 January 06

మొన్న మందడం మహిళలు పోలీసులకు ఎదురుతిరిగారు: తుళ్లూరు డీఎస్పీ

మందడం మహిళలు కానిస్టేబుళ్లపై దాడి చేశారు: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచిన ఫొటోలను మీడియాకు చూపించిన డీఎస్పీ

09:39 January 06

రాజధాని పై రైతుల పోరు

రాజధాని రైతుల పోరు 20వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు  20వ రోజుకు చేరాయి. తుళ్లురు నుంచి వెలగపూడి మీదుగా మందడం వరకు రైతులు ర్యాలీగా వెళుతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతుల నిరసన, మహిళల పూజలు కొనసాగనున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో రైతు నిరసనలు హోరెత్తుతున్నాయి.

Last Updated : Jan 6, 2020, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.