అధికార వైకాపా.. స్థానిక ఎన్నికలల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరా వేస్తామన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంతో మీడియా సమావేశం నిర్వహించారు.
అభివృద్ధి చేశాం. ప్రజా బలముందని చెప్పుకునే వైకాపా ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలను ఎందుకు చేయాల్సివస్తుందో. గురజాల, జంగమహేశ్వరపురంలో తెదేపా అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్ వేయించమని హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం తీర్పును అమలు చేస్తారా? లేదా కోర్టు ధిక్కారం ఎదుర్కొంటారా? అనే విషయాన్ని అధికారులే నిర్ణయించుకోవాలి. వాలంటరీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. పరిధిని అతిక్రమించి పనిచేసే ఏ అధికారులను ఉపేక్షించం.తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. -యర్రపతినేని శ్రీనివాసరావు, తెదేపా నేత