ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద నీటితో నీటమునిగిన ఇళ్లు

By

Published : Oct 25, 2019, 6:49 PM IST

కృష్ణా వరద నీరు పల్లెపాలెంలోకి చేరి..ఇళ్లు నీటమునిగాయి. వరద పెరుగుతుండడంతో తీరప్రాంత గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద బాధితులను పునరావాస ప్రాంతాలకు అధికారులు తరలించారు.

floods-in-repalle-in-guntur-district

వరద నీటితో నీటమునిగిన ఇళ్లు

ప్రకాశం బ్యారేజి నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. నది సమీపంలోని రేపల్లె మండలం పెనుముడి గ్రామం వద్ద పల్లెపాలెంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్రమేపీ వరద నీరు పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ముంపు గ్రామాల్లో అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు తహశీల్దార్ విజయశ్రీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details