కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను నిర్ణయిస్తూ గుంటూరు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ వెల్లడించారు.
కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు
కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను నిర్ణయిస్తూ గుంటూరు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ వెల్లడించారు.
సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నచ్చినంత దోచుకుంటున్నారు. ఈ విషయం ఈటీవీ భారత్- ఈనాడు కథనాల ద్వారా జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో ప్రైవేటు అంబులెన్సులు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత రుసుం నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేశారు. కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లడానికి తేలికపాటి వాహనాలకు 2,600, సాధారణ మృతదేహాలకు 1600 రూపాయల చొప్పున ఛార్జీలు నిర్ణయించారు. గరిష్ఠంగా 101 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు 5,600 రూపాయలు...సాధారణ మృతదేహమైతే 4,600 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. నిర్దేశిత ఛార్జీలనే వసూలు చేయాలని.. లేనిపక్షంలో బాధితులు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లోని ఫోన్ నంబర్లు 0863-2229336, 2271492కు ఫిర్యాదు చేయాలని డీటీసీ మీరా ప్రసాద్ కోరారు.
ఇదీ చూడండి.ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువతి బలవన్మరణం