ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిర్యాదు చేసేందుకు వెళ్లి.. స్టేషన్ ఎదుటే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు! - సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ తాజా వార్తలు

ఇంటి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవైంది. ఈ విషయపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. మాటా మాటా పెరిగి స్టేషన్ ఎదుటే మళ్లీ ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

fight infront of police station in sattenapalli guntur district
ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.. స్టేషన్ ఎదుటే పిడిగుద్దులు గుద్దుకున్నారు

By

Published : Jun 27, 2020, 7:13 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివాన అయ్యింది. నిర్మాణం విషయంలో ఇంటి యజమానికి, భవన నిర్మాణ కార్మికులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇరువురూ.. పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. స్టేషన్ ఎదుటే మళ్లీ మాటా మాటా అనుకుని బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు వచ్చి వారిని చెదర గొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details