మద్యం మత్తులో దాడికి యత్నించిన తనయుడిని కన్న తండ్రే చంపిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తెనాలి పాండురంగపేటలో నివాసం ఉంటున్న దుద్దుకూరు జగదీష్ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో తండ్రి సీతాపతి పైన దాడికి పాల్పడ్డాడు. దాడిని ప్రతిఘటించిన సీతాపతి పక్కనే ఉన్న కూరగాయల కత్తితో జగదీష్‌ని పొడిచాడు. కత్తి గుండెల్లో గుచ్చుకోవడంతో జగదీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సీతాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కన్నకొడుకును హతమార్చిన తండ్రి - son murder by father
మద్యం మత్తులో దాడికి యత్నించిన తనయుడిని కన్న తండ్రే చంపిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.
కొడుకును హతమార్చిన తండ్రి