ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నాలు - ఏపీలో రాజధాని వార్తలు

గుంటూరు జిల్లాలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మహిళలు, రైతులు, కూలీలు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'
'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'

By

Published : Jan 14, 2020, 5:59 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని... లేనిపక్షంలో ఉద్యమాలు ఉద్దృతం చేస్తామన్నారు.

అధికార వికేంద్రీకరణ సరికాదు...
అభివృధ్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకం కాదని... అధికార వికేంద్రీకరణ సరికాదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. అమరావతి కావాలని ఇక్కడి రైతులు అడగలేదు... ఇప్పుడు అధికారం ఉందని రూపుదిద్దుకున్న ప్రాంతాన్ని వికేంద్రీకరణ చేస్తామనటం సరికాదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ఇస్తామన్న నిధులు వీటిపై ఎందుకు మాట్లాడారని అన్నారు.

రైతుల పాదయాత్ర
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామంలో రైతులు పాదయాత్ర నిర్వహించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ముందుగా గ్రామంలో సేవ్ అమరావతి పేరుతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియ పక్కనపెట్టి ఉన్న రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప రాజధానుల వికేంద్రీకరణ వల్ల ఉపయోగమేమీ ఉండదన్నారు. 13 జిల్లాలకు మూడు రాజధానులుంటే 75 జిల్లాలు ఉన్న ఉత్తరప్రదేశ్​కు ఎన్ని రాజధానులు ఉండాలని ప్రశ్నించారు. రాజధానికి మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కదలి రావాలని అల్లూరివారిపాలెం రైతులు, యువత పిలుపునిచ్చారు.

'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'

కేంద్రానికిఎమ్మెల్యే అనగాని లేఖ
అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని... గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని లేఖలో ఆరోపించారు. అర్దరాత్రి సమయాల్లో రైతుల ఇళ్లలోకి చొరబడి సంక్రాంతికి వచ్చిన బంధువుల వివరాలు చెప్పాలని సోదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాజధాని గ్రామాల్లో నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదన్నారు.

భూములు ఇచ్చిన రైతులు పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బెజవాడ దుర్గమ్మకు మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వెళ్లేవారిని అడ్డుకొని చితకబాదారని... మహిళలను, పిల్లలను కూడా ఈడ్చుకు వెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించారని లేఖలో పేర్కొన్నారు. మహిళలను బూటు కాళ్లతో అమానుషంగా తన్నారని... రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారని వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను ప్రయోగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించిందన్నారు.

'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'

రాజధానికి మద్దతుగా...తెదేపానేత సుహాసిని
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందినా రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలని తెలుగుదేశం నాయకురాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సుహాసిని మద్దతు పలికారు. రైతులతో ముచ్చటించారు. అమరావతి కోసం తామంతా భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని మహిళలు సుహాసిని ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతి ఈ ప్రాంతంలోనే కొనసాగాలంటూ రైతులతో కలిసి నినాదాలు చేశారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని సుహాసిని చెప్పారు.

'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'

పాటతో అమరావతికి మద్దతు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం చర్యలకు కర్నూలుకు చెందిన సినీ సంగీత దర్శకుడు ఖుద్దుస్ చక్కని పాట రాసారు. గుంటూరులో ఆయన ప్రత్యేక హోదా విభజన హామీల పోరాట సమితి ఆధ్వర్యంలో మౌన దీక్షలో పాల్గొన్నారు. తొలుత తాను రాసిన పాట పాడిన తరువాత దీక్ష చేపట్టారు.

'అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలి'

ఇవీ చదవండి

నిరసన వీడని అమరావతి... భోగి మంటల్లో కమిటీ ప్రతులు

ABOUT THE AUTHOR

...view details