ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పరిహారంపై స్పష్టత వచ్చే వరకు పనులు జరగనివ్వం'

By

Published : Aug 2, 2021, 7:46 PM IST

గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలో కరకట్ట విస్తరణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. విస్తరణ పనులు ప్రారంభించే ముందు రైతుల భూములు ఎంత పోతున్నాయి...వాటికి పరిహారం ఎంత ఇవ్వాలనే అంశాన్ని ఇంతవరకు అధికారులు వెల్లడించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు నష్టపరిహారంపై సరైన హామీ ఇవ్వాలని.. లేకపోతే పనులు శాశ్వతంగా నిలిపేస్తామని హెచ్చరించారు.

farmers
రైతులు

పరిహారంపై స్పష్టత వచ్చే వరకు పనులను జరగనివ్వం

అమరావతి ప్రాంతంలో కృష్ణా కరకట్ట విస్తరణ పనులను రైతులు అడ్డుకున్నారు. కరకట్ట విస్తరణ పేరుతో తమ పొలాల్లో సుమారు 17మీటర్లకుపైగా చొచ్చుకొస్తున్నారంటూ విస్తరణ పనలను తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద రైతులు నిలిపేశారు.

విస్తరణ పనులు ప్రారంభించే ముందు రైతుల భూములు ఎంత పోతున్నాయి.. వాటికి పరిహారం ఎంత ఇవ్వాలనే అంశాన్ని ఇంతవరకు అధికారులు వెల్లడించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట వెంట భూసమీకరణకు ఇచ్చిన, ఇవ్వని పొలాలున్నాయని రైతులు తెలిపారు. భూసమీకరణకు ఇచ్చిన భూమిలో, ఇవ్వని భూముల్లోనూ దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు వచ్చి తమకు నష్టపరిహారంపై సరైన హామీ ఇవ్వాలని లేకపోతే పనులు శాశ్వతంగా నిలిపేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

గృహ నిర్మాణ సంస్థ, ప్లాట్ల యజమానుల మధ్య వివాదం..ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details