గుంటూరు జిల్లా మంగళగిరి రైతులు.. తమ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చారనీయ... ఇప్పుడు ఆ హామీ నెరవెర్చటం లేదని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని రైతులకు పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారని అన్నదాతలు చెప్పారు. ప్రస్తుతం తామంతా ఆందోళనలో ఉన్నామని...ఈ సమయంలో తమను ఆదుకోవాల్సింది...పోయి పట్టించుకోవాట్లేదని... వాపోతున్నారు. తక్షణమే తమ ఎమ్మెల్యే ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు విన్నవించారు.
మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్! - ఎమ్మెల్యే కనిపించటం లేదని...పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు
మంగళగిరి నుంచి తాము ఓట్లేసి గెలిపించిన శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించటం లేదంటూ.. ఆ ప్రాంత రైతులు పోలీసులకు ఫిర్యాదు కలిశారు.
ఎమ్మెల్యే కనిపించటం లేదని...పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు
Last Updated : Dec 23, 2019, 3:23 PM IST