.
రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్పైకి ఎక్కి రైతుల ఆందోళన - అమరావతి వార్తలు
గుంటూరులో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయపూడిలో ముగ్గురు రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ పైకి ఎక్కి నిరసన చేపట్టారు. రాజధాని తరలింపు అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ.... రాజధాని కోసం ప్రాణాలైనా అర్పిస్తామని రైతులు తెలిపారు.
రాయపూడిలో ఎమ్మెల్యే క్వాటర్స్ ఎక్కి రైతుల నిరసన