పులిచింతల ప్రాజెక్టులో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 7 ఎలిమెంట్లను ఇంజినీరింగ్ నిపుణులు అమర్చారు. స్టాప్‌లాక్ ఏర్పాటుకు మెుత్తం 11 ఎలిమెంట్లను అమర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే చీకటి పడటంతో స్టాప్ లాక్ పనులను నిపుణులు, సిబ్బంది నిలిపివేశారు. మళ్లీ రేపు ఉదయం స్టాప్ లాక్ పనులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
Pulichintala Gate: ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు - పులి చింతల ప్రాజెక్టు ముఖ్య వార్తలు
పులిచింతల ప్రాజెక్టులో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7 ఎలిమెంట్లను ఇంజినీరింగ్ నిపుణులు అమర్చారు. స్టాప్‌లాక్ ఏర్పాటుకు మెుత్తం 11 ఎలిమెంట్లను అమర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు
రేపు మధ్యాహ్ననికి మెుత్తం ఎలిమెంట్ల పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. స్టాప్‌లాక్ ఏర్పాటు తర్వాత జలాశయంలో నీరు నింపేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం పులిచింతలకు 33 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి: