గతంలో రెండుసార్లు వాయిదా పడిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... తెలుగుదేశం 9, వైకాపా 8, జనసేన ఒక స్థానం గెలిచాయి.
Mpp Election: దుగ్గిరాల ఎంపీపీ పదవికి రేపే ఎన్నిక - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్డేటేస్
దుగ్గిరాల ఎంపీపీ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. కోరం లేని కారణంగా ఎన్నికలు గతంలో రెండు సార్లు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఇక్కడ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Mpp Election
బీసీలకు ఎంపీపీ పదవి రిజర్వ్ కాగా.... తెలుగుదేశం నుంచి గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి జబీన్‌కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వటంలో అధికారులు ఆలస్యం చేశారు. దీనివల్ల ఎంపీపీ ఎన్నికకు తెలుగుదేశం సభ్యులు రెండుసార్లు హాజరు కాలేదు. ప్రస్తుతం జబీన్ కుల ధృవీకరణపై గుంటూరు జిల్లా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Covid cases in India: దేశంలో మరో 22వేల మందికి కరోనా