కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఇకపై కార్యకర్తలకు పార్టీ భవనాలకు రాకుండా ఇళ్లలోనే ఉండి పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్, ఫోన్ల ద్వారా అందించాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ‘‘కరోనా వైరస్’’ పుస్తకాలు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేసి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
కరోనా నేపథ్యంలో తెదేపా కీలక నిర్ణయాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధానమంత్రి సూచనల మేరకు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా నేపథ్యంలో తెదేపా కీలక నిర్ణయాలు