ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2019, 12:15 PM IST

ETV Bharat / state

'సీఎం సారూ... మా బాధను అర్థం చేసుకోండి..!'

ఇక్కడ క్యూలైన్​లో బారులు చూశారా. వీరు ఉల్లికోసమో... సినిమా టికెట్ల కోసమో రాలేదు. వీరు పొద్దంతా పనిచేసి... ఒళ్లు అలసినవారు. ఓ పెగ్గు తాగితేనే కాని నిద్రపట్టనివారు. చీకటి పడగానే మందు కోసం ఆరాటపడే వీరి కష్టాలు.. సామాన్యులను ముక్కున వెలేసుకునేలా చేస్తున్నాయి. మద్యం కోసం గుంటూరు అమరావతి రోడ్డులో ఇలా బారులు తీరారు.

drinkers que for wine at guntur district
గుంటూరులో ఓ మద్యం దుకాణం ముందు బారులు తీరిన మందు బాబులు

సీఎం సారూ... మా బాధను అర్థం చేసుకోండి..!

గంటల తరబడి క్యూలో నిలుచున్నా... మద్యం దొరకడంలేదని మందుబాబులు తల్లడిపోతున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ వైన్స్ ముందు... మద్యం కోసం ఇలా బారులు తీరారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలు పెరిగాయని మందుబాబులు వాపోతున్నారు. దానికితోడు బార్లు, రెస్టారెంట్లలో అధిక ధరలకు విక్రయించడం కారణంగా... మద్యం ప్రియులు తల్లడిపోతున్నారు. ఎక్కడ వైన్ షాప్ కనిపిస్తుందా... ఎక్కడ మద్యం దొరుకుతుందా అంటూ వెతుకుతున్నారు. ఎక్కడైనా మందు దుకాణం కనిపిస్తే అక్కడ గంటల తరబడి లైన్​లో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details