ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిర్బంధాల మధ్య ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరు' - Dokka Manikya Varaprasad house arrest news

21రోజులుగా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. దానిని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు... గుంటూరులో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని హౌస్​ అరెస్ట్​ చేశారు. పోలీసుల తీరును డొక్కా మాణిక్యవర ప్రసాద్​ తప్పుపట్టారు. రాజధాని మార్చాలనే సీఎం చర్యలు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అన్నారు. రాజధాని భూముల విషయంలో కొందరు రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం అడిగితే వివరాలు ఇస్తానని ఆయన తెలిపారు. పోలీసుల నిర్బంధం మధ్య ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరని ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్‌ తెలిపారు.

Dokka Manikya Varaprasad house arrest
డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గృహనిర్బంధం

By

Published : Jan 7, 2020, 11:52 AM IST

డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గృహనిర్బంధం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details