అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు మూడు రాజధానుల ప్రకటనపై రాష్ట్రంలో పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని రైతుల నిరసనలకు మద్దతుగా గుంటూరు విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. కొన్ని కళాశాలలు యథావిధిగా నిర్వహించటంతో, విద్యార్థి సంఘాల నేతలు కళాశాల బస్సులను అడ్డుకున్నారు. బస్స్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రాంతలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయాల మానుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సూచించారు.ఇదీ చదవండి: 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య