వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి ఆరోపించారు. రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన నా ఇల్లు-నా సొంతం ర్యాలీలో పాల్గొన్న ఆమె...వైకాపా పాలనపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదికను కూల్చారని...కట్టేవాడు నాయకుడా ? కూల్చేవాడు నాయకుడా? అని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది' - జగన్పై దివ్వవాణి కామెంట్స్
రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి విమర్శించారు. వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారన్నారు.
'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'