రాజధాని రైతులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్దండరాయునిపాలెం రైతులను మందడం దీక్షా శిబిరంలో కలిసి పరామర్శించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్నదాతలపై తప్పుడు కేసులు బనాయించిందని.. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తముందని దేవినేని ఆరోపించారు.
'రైతులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటాం' - దేవినేని ఉమ తాజా వార్తలు
ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కొంటున్న రైతులను దేవినేని ఉమ పరామర్శించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని అన్నారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దేవినేని ఉమ