తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ముఖ్యమంత్రి నివాసం వద్ద గోపాల మిత్రల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 20 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించామని గోపాల మిత్రల సంఘం నేతలు చెప్పారు. జగన్ పాదయాత్ర సమయంలో తమను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని.. దానిని నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయంలో నియమించే వాలంటీర్లలో తమను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గోపాలుల ధర్నా - గోపాలమిత్ర
గోపాలమిత్ర ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలంటూ ముఖ్యమంత్రి నివాసం ఎదుట వారు చేసే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చివ హామీలను నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు.
తమ సమస్యలు చెపుతున్న గోపాలమిత్రులు