ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని లా మండల కేంద్రమైన చేబ్రోలులో జరిగింది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

By

Published : May 13, 2019, 8:48 PM IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో ముత్యం సుబ్రమణ్యం అనే యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని లా మండల కేంద్రమైన చేబ్రోలులో జరిగింది. చాకలి పేటలో శంకర్​కు చెందిన నూతన ఇంటి నిర్మాణం జరుగుతోంది. సుబ్రమణ్యం మరుగుదొడ్డి నుంచి నీళ్ళు బయటకు పోయేందుకు పైపులైను అమరుస్తున్నారు. పైపుల అమరికకు అడ్డుగా గోడ రావటంతో దానికి విద్యుత్ యంత్రం పరికరంతో కన్నం చేసేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ వాహినిలో విద్యుత్ ప్రసారం కాకపోవడంతో స్విచ్ ఆపకుండానే మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details