గుంటూరులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు కార్యాలయంలో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 33 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒక్కసారిగా 33 కేసులు నమోదు కావటంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొద్దిరోజులు పాటు కార్యాలయాన్ని తాత్కాలింగా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.