ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది భోజనాలు. గతంలో ఇంటిల్లిపాదీ కలసి వంటపని చూసుకునేవారు. మారుతున్న పరిస్థితుల్లో అందరూ కేటరింగ్‌కు అలవాటుపడ్డారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా... భోజనాల కోసం క్యాటరింగ్‌పై ఆధారపడటం మొదలెట్టారు. కొద్ది కాలంలోనే ఆ రంగం విస్తరించడంతోపాటు... ఎంతో మందికి ఉపాధి కేంద్రంగా మారింది. సాఫీగా సాగుతున్న ఈ రంగానికి కరోనాతో ఇబ్బందులు తలెత్తాయి. కరోనా వ్యాప్తి నివారణకు భౌతికదూరం అనివార్యమై వివాహాలు, బారసాలలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాలు ఇలా అన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా నిర్వాహకులతో పాటు అందులో పనిచేసే వారు కూడా పూట గడవక అల్లాడిపోతున్నారు.
క్యాటరింగ్ రంగంపై కరోనా ప్రభావం
లాక్‌డౌన్‌తో అన్ని రంగాల మాదిరిగానే క్యాటరింగ్ దారుణంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికక్కడే వివాహాలు, శుభకార్యాలు ఆగిపోవడం వల్ల....క్యాటరింగ్ పరిశ్రమ స్తంభించింది. ఫలితంగా నిర్వాహకులతోపాటు.... దీనిపై ఆధారపడి జీవించే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.
కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యాటరింగ్ రంగం
పైగా వేసవిలో వివాహాల సీజన్ ఉంటుందని పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి సామగ్రి కొనుగోలు చేశామని ఇప్పుడు నిర్వహణ భారం పెరిగి అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. మాములుగా అయితే రోజూ పని దొరికేదని ప్రస్తుతం పూటగడవట్లేదని ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు వాపోతున్నారు.
ఇవీ చదవండి: జంతు ప్రేమను చాటుకుంటున్న దంపతులు!