ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సురక్షిత ప్రాంతాలకు ముంపు బాధితులు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

By

Published : Sep 15, 2020, 7:37 AM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్ష పాతం నమోదు కావడం పులిచింతల జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యావసర సేవల నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Control rooms set up
జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే సగటున 35.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు భారీ వర్షాలు తోడై.. పులిచింతల నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. వరద ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ సూచించారు. సహాయక చర్యలు, వరద పరిస్థితులను తెలుసుకునేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో అత్యవసర కంట్రోల్‌ రూంను, డివిజన్ల వారీగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు.

జిల్లాలో 24 గంటలు పని చేయనున్న కంట్రోల్ రూము ఫోన్ నంబర్లు :-

జిల్లా కలెక్టరేట్ లోని డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ సెంటర్ 0863– 2324014

గుంటూరు రెవిన్యూ డివిజనల్ కార్యాలయం 0863 – 2240679

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం 08644 – 223800

గురజాల రెవిన్యూ డివిజనల్ కార్యాలయం 77028 53860, 81061 42574

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పశువుల మేతకు, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం సూచించింది.

ఇవీ చూడండి:

ఓఎల్​ఎక్స్​ పేరుతో మోసం..పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details