రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో స్థితిగతులను పూర్తిగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో 'నాడు-నేడు' అమలుపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో 'నాడు-నేడు' ద్వారా పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో స్థితిగతులు పూర్తిగా మార్చాలి: సీఎం జగన్
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో 'నాడు-నేడు' అమలుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు పౌష్ఠికాహారం అందించాలని ఆదేశించారు.
cm jagan
హాస్టళ్లలో పూర్తి వసతులను 'నాడు-నేడు' ద్వారా కల్పిస్తామని వెల్లడించారు. అక్కడ నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత ఉండేలా చూడాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా అందిస్తామని వెల్లడించారు.
సీఎం ఆదేశాలు మరికొన్ని....
- చక్కటి వాతావరణంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందించాలి
- పిల్లలకు బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు తప్పక ఏర్పాటు చేయాలి
- వసతులతోపాటు మంచి పౌష్ఠికాహారం ఇవ్వాలి
- ఎలా పౌష్ఠికాహారం ఇవ్వాలో ప్రణాళికలు రూపొందించాలి