గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వ్యాప్తిపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు, తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరోనాను అదుపుచేయటానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో దుకాణాలను మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొవిడ్ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్
కొవిడ్ నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ అధికారులకు సూచించారు. నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొవిడ్ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్