గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు. ఏ కారణంతో తొలగించారని ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా ఉన్నతాధికారులు తొలగించాలని సూచించారని చెప్పారు. దీంతో నిర్వాహకులు విద్యాశాఖ అధికారిని ప్రశ్నించగా. 'నేను ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేద'ని సమాధానం చెప్పడంతో నిర్వాహకులు కోపోద్రిక్తులయ్యారు. తమకు సరైన సమాధానం చెప్పాలంటూ వాగ్వివాదానికి దిగారు. తమకు సమాధానం చెప్పకుండా ఎక్కడకి కదిలేది లేదంటూ ఆయన గది ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లే తమను విధుల్లోంచి తొలగించారని నిర్వాహకులు వాపోతున్నారు. అనంతరం త్వరగతిన న్యాయం చేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల తొలగింపు..ఆందోళన - guntur
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు విద్యాశాఖ అధికారి మధ్య వాగ్వివాదం ఎక్కువ కావటంతో భోజన పథక నిర్వాహకులు విద్యాశాఖ అధికారిని నిర్భందించిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో జరిగింది.
మమ్మల్ని ఎందుకు తొలగించారయ్యా