ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తప్పుచేసి తప్పించుకోవడం జగన్​కు అలవాటే' - party

"తప్పు చేసి తప్పించుకోవడం జగన్​కు అలవాటు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై నిందలు వేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారు. ఆయన హత్యలో వాస్తవాలన్నీ బయటకు తీస్తాం." - చంద్రబాబు, తెదేపా అధినేత

చంద్రబాబు

By

Published : Mar 16, 2019, 11:05 AM IST

రైతులు, మహిళలు, యువతరం మద్దతు తెదేపాకే ఉందని అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ చేశారు. తెదేపాకు ఉన్న ప్రజాదరణ చూసి వైకాపా నేతలు ఓర్వలేకేనిందలు వేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగితే... తెదేపాపై నెపం వేయడం అమానుషమని చెప్పారు. తప్పులు చేసి తప్పించుకోవడంలో జగన్ ఆరితేరారన్నారు. వివేకా హత్యలో వాస్తవాలన్నీ బయటకు తీస్తామని... అన్ని అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details