ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేసిన సీఎం జగన్​... రూ.12.01 కోట్లుగా జీఎస్డీపీ

సీఎం జగన్​... సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. జీఎస్డీపీ రూ.12.01 కోట్లుగా ఉంది. ఏపీలో వార్షిక వృద్ధి రేటు 18.47 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదని, ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని సీఎం అన్నారు.

Socio Economic Survey
సోషియో ఎకనమిక్ సర్వే విడుదల

By

Published : Mar 11, 2022, 2:34 PM IST

సోషియో ఎకనమిక్ సర్వే విడుదల

కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్​... సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. ఏపీలో వార్షిక వృద్ధి రేటు 18.47 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదని, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు. దేశ ప్రగతి రేటు కంటే ఏపీ ప్రగతి ఎక్కువగా ఉందన్నారు.

అన్ని రంగాల్లోనూ పురోగతి, ప్రగతి సాధించామని ప్రణాళిక శాఖ కార్యదర్శి జీఎస్ ఆర్ కె ఆర్ విజయకుమార్ స్పష్టం చేశారు. పరిశ్రమలు, సేవా రంగాలు కూడా పుంజుకున్నాయన్నారు. తలసరి ఆదాయం ఏపీలో రూ.2 లక్షల 7 వేలకు పెరిగిందన్నారు. సుస్థిరాభివృద్ధిలోనూ ప్రగతి సాధించామని తెలిపారు.

" 2021-22 ఏడాదికి ఏపీ జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. గత సంవత్సరంలో రూ.10 లక్షల 14 వేల 374 కోట్లుగా ఉంటే... రూ.లక్షా 87 వేల 362 కోట్ల ప్రగతిని సాధించడమనేది ఎప్పుడూ జరగలేదు. వ్యవసాయ రంగంలో రూ.3.9 కోట్లు, పరిశ్రమల రంగంలో సుమారుగా రూ.2.5 కోట్లు, సేవల రంగంలో రూ.4.67 కోట్లు... ఇలా ఒక ఏడాదిలో జీఎస్టీపీగా రావడం... రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి"- విజయ్​కుమార్​, ప్రణాళిక శాఖ కార్యదర్శి

ఇదీ చదవండి:AP Budget: మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్​కు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details