తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నారాయణ, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేసిన బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. అలాగే బీసీ కార్పొరేషన్స్, బీసీలకు ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రాథమిక చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల ఎంపికపైనా సీఎంతో మంత్రులు, బీసీ నేతలు మాట్లాడినట్లు సమాచారం.
బీసీ మంత్రులతో సీఎం జగన్ సమావేశం - సీఎం జగన్ లేటెస్ట్ న్యూస్
బీసీ మంత్రులు, వైకాపా బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలపై ప్రధానంగా చర్చించారు. బీసీ కార్పొరేషన్, బీసీలకు ప్రాధాన్యత వంటి వాటిపై ప్రాథమికంగా చర్చ జరిగింది.
cm jagan met bc leaders and review on janga krishna murthy committee report