అభివృద్ధి పనులకు కేంద్రం అడ్డంకులు: చంద్రబాబు - చంద్రబాబు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రైతులను మోసం చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు.
cm chandrababu
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పోలవరానికి నిధుల విడుదలలో కేంద్ర కావాలనే ఆలస్యం చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. తడిచిన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని అధికారులను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జొన్న, మొక్కజొన్న రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరవు మండలాల్లో ఉపాధి పనులు వేగవంతం చేయాలన్నారు.