'అభివృద్ధి - సంక్షేమంలో రాజీ పడొద్దు'
ఈ నెల 9 న రాష్ట్రంలో జరిగే 4 లక్షల సామూహిక గృహప్రవేశాలు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడొద్దని సూచించారు.
cm chandra babu
అమరావతిలో సీఎం చంద్రబాబు నీరు-ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9 న నిర్వహించే 4లక్షల సామూహిక గృహప్రవేశాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడొద్దని సూచించారు. రెండు రోజుల్లోనే 24 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామన్నారు. బ్యాంకులకు 2,350 కోట్లు కేటాయించామన్నారు. నగదు చెల్లింపులో మహిళలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.