శుక్రవారం పోలింగ్ ఉంటే.. జగన్ ఓటు వేయలేరు! - #apelecions2019
జగన్ అసెంబ్లీకి రారు కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు మాత్రం వెళ్తారు. పోలింగ్ శుక్రవారం రోజున పెడితే జగన్ ఓటు కూడా వేయలేరు: గుంటూరు రోడ్‌షోలో చంద్రబాబు
రోడ్‌షోలో సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)
జగన్ మామూలు వ్యక్తి కాదని... అరాచక శక్తి అని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత అంత కరుడుగట్టిన మరో అవినీతిపరుడెవరూ.. ఎన్నికల్లో పోటీలో లేరని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారేగానీ అసెంబ్లీకి రారని ఎద్దేవా చేశారు. పోలింగ్ శుక్రవారం రోజున పెడితే జగన్ ఓటు వేయలేరని అన్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ తనకు ఇవ్వకుండా.. నగదు రూపంలో జగన్‌కి ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికే వెయ్యి కోట్లు వైకాపాకు అందాయని ఆరోపించారు.