Chandrababu to G20 meeting: తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకూ జీ 20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించేందుకు ప్రధాని, రాష్ట్రపతి భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు.
రేపు దిల్లీకి చంద్రబాబు.. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు
Chandrababu to G20 meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకూ జీ 20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించేందుకు ప్రధాని.. రాష్ట్రపతి భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు.
రేపు దిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్ చేసి సమావేశ వివరాలు ఇప్పటికే వివరించారు. రేపు ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు దిల్లీ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన దిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని రాత్రి 7 గంటల వరకు అక్కడ జరిగే జీ 20 సమావేశంలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: