ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​ఫోన్ కంటైనర్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్.. సరకు స్వాధీనం

గుంటూరులో జరిగిన సెల్‌ఫోన్‌ కంటైనర్ చోరీ కేసును పోలీసులు 2 వారాల వ్యవధిలో ఛేదించారు. కంజర్​భట్ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన సరకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మంది నిందితులు ఉన్నారని.. మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

ammireddy, guntur sp
అమ్మిరెడ్డి, గుంటూరు ఎస్పీ

By

Published : Oct 4, 2020, 2:11 PM IST

Updated : Oct 4, 2020, 3:20 PM IST

సెల్​ఫోన్ కంటైనర్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

గుంటూరులో జరిగిన సెల్‌ఫోన్‌ కంటైనర్ చోరీ కేసును పోలీసులు 2 వారాల వ్యవధిలో ఛేదించారు. మధ్యప్రదేశ్‌లో గస్తీ నిర్వహించిన పోలీసులు... అత్యంత ప్రమాదకరమైన కంజర్‌భట్‌ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద గుంటూరు చోరీకి సంబంధించిన సరకు, నగదుతో పాటు.. మెదక్‌ జిల్లా చేగుంట చోరీకి సంబంధించిన సొత్తునూ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో చోరీకి గురైన 960 సెల్​ఫోన్లలో 862 స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా నగరిలోనూ దొంగతనం చేసింది కంజర్‌భట్‌కు చెందిన వారేనని... అయితే రెండింటి శైలి వేరని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు. చోరీలో 11 మంది నిందితులుండగా... ఇద్దరిని పట్టుకున్నామని మిగతా వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. నిందితుల అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు. సెల్​ఫోన్లు తరలించే కంపెనీలు ఇకపై రవాణాలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. కంటైనర్ల వెనుక సీసీ కెమెరాలు అమర్చుకోవాలని చెప్పారు.

Last Updated : Oct 4, 2020, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details