ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు కేసులు నమోదు

ముందస్తు అనుమతి లేకుండా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు నిరసన చేపట్టారని గుంటూరు జిల్లా అరుండల్ పేట ఠాణా కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నియమాలను ఉల్లంగించి, ట్రాఫిక్​కు అంతరాయం కలిగించినందున 2 కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు కేసులు నమోదు
అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు కేసులు నమోదు

By

Published : Oct 12, 2020, 6:01 AM IST

గుంటూరు జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ర్యాలీ చేపట్టారని అరుండల్ పేట ఠాణా కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నియమాలను ఉల్లంగించి, ట్రాఫిక్​కు అంతరాయం కలిగించినందున 2 కేసులు నమోదు చేశామని అరుండల్​పేట సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.

రోడ్డుపై బైఠాయించి..

ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో అరుండల్​పేట ఠాణా పరిధిలోని శంకర్ విలాస్ కూడలి, లాడ్జ్ సెంటర్ కూడలిలో అమరావతి జేఏసీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారని సీఐ పేర్కొన్నారు.

అనుమతులు..

అమరావతి పరిరక్షణ ర్యాలీ పేరిట గుంటూరు పట్టణంలో తలపెట్టిన ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పశ్చిమ డీఎస్పీ ఆదేశాలు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు జీవీ అంజనేయులు, నజీర్ అహ్మద్, మన్నవ సుబ్బారావు, లాల్ వజీర్, డా. శైలాజ, వేగుంట రాణి, కనపర్తి శ్రీనివాసారావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయికృష్ణ, ఆలపాటి రాజా, గొల్ల ప్రభాకర్, షేక్ హసన్ భాషా, మల్లికార్జునరావు పైన కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

ఇవీ చూడండి : 300వ రోజుకు చేరువలో రాజధాని ఉద్యమం..రైతుల భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details