ఎప్పుడూ పుస్తకాలు, హోం వర్కులు, పరీక్షలతో కుస్తీపట్టే విద్యార్థుల్లో కార్నివాల్ సంబరం ఉత్సాహాన్ని నింపింది. పిల్లల ఉత్సాహం చూసి పెద్దలు మురిసిపోయారు. గుంటూరు సమీపంలోని లాం దిల్లీ పబ్లిక్ స్కూల్లో చిన్నారుల కార్నివాల్ నిర్వహించారు. పిల్లల కేరింతలు, సందడితో కార్నివాల్ మార్మోగిపోయింది. ఒత్తిడి నుంచి కొంచెం ఉపశమనం లభించేందుకు పాఠశాల యాజమాన్యం 40 రకాల ఆటలు నిర్వహించింది. పిల్లలకు మానసికోల్లాసం, మనోవికాసం అవసరమని.. అందుకే ప్రతియేటా ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
చిన్నారుల్లో ఉత్సాహం నింపిన కార్నివాల్ - లాం దిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్నివాల్ ఉత్సవం
గుంటూరు జిల్లా లాంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్నివాల్ చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఈ ఉత్సవంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
లాం దిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్నివాల్ ఉత్సవం