'ఓట్లు వేసి గెలిపించిన వారంతా నిలదీయండి' - capital farmers demand to ask ycp leaders who vote for party winning
అమరావతికోసం రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 50వ రోజుకు చేరాయి. వైకాపాకు ఓటు వేసిన వాళ్లంతా ఆ పార్టీ శాసనసభ సభ్యులను నిలదీయాలని తుళ్లూరు మండలం వెలగపూడి మహిళలు డిమాండ్ చేశారు. యువత విదేశాలకు తరలిపోకుండా ఆంధ్రాలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు కోరారు.. తమ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు