ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మండలి రద్దు నిర్ణయానికి వారి చర్యలే కారణం' - మండలిపై అంబటి కామెంట్స్

రాజధాని మార్పు అంశంపై కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శాసనమండలిలో నిబంధనలు ఉల్లంఘించి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం వల్లే మండలి రద్దు అంశం తెరమీదకు వచ్చిందన్నారు.

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

By

Published : Jan 25, 2020, 6:28 PM IST

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

రాజధాని మార్పు అనే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని.. దానికి కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఎన్నికల సమయంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పిన భాజపా.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మండలిలో నిబంధనలు ఉల్లంఘించి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారని అంబటి మండిపడ్డారు. ఆ చర్యే... మండలి రద్దుకు ప్రేరేపించిందన్నారు. అభివృద్ధికి నిరోధకమైన మండలిని రద్దు చేయాలన్నదే మా ఆలోచన అని తెలిపారు.

మండలిని వైఎస్ తెచ్చినా.. దాన్ని రద్దు చేయాలా.. వద్దా అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. వైఎస్ గతంలో జాతీయ పార్టీలో సీఎంగా పని చేశారని..దిల్లీ ఒత్తిళ్ల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details