ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర నీటి హక్కుల్ని తెలంగాణ హరిస్తున్నా..ఎందుకు అడ్డుకోవట్లే?

తెలంగాణ చర్యలతో నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని.. ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమిలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర పరిధిలోకి రాదని అన్నారు.

bjp leader harshavaradhan
భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి సమావేశం

By

Published : Jul 12, 2021, 12:34 PM IST

Updated : Jul 12, 2021, 12:53 PM IST

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు అడ్డుకోవటం లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నీటి దొంగతనం చేయటమే కాకుండా .. ఏపీని బెదిరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని దయనీయ పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ చర్యలతో నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని... అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఏపీ ప్రాజెక్టు వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాసి ముఖ్యమంత్రి తప్పించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాజెక్టులను ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. కేవలం ఆస్తులను రక్షించుకోవటం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర పరిధిలోకి రాదన్నారు. జల వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా ఉద్యమం చేస్తుందని తెలిపారు

వైకాపా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలపై పన్నుల భారం మోపటం మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి... ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి కల్పించారన్నారు. ముఖ్యమంత్రి అప్పుల కోసం చంద్ర మండలానికి కూడా వెళ్లేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 కులాలకు కార్పోరేషన్లు పెట్టి ఏ ఒక్క కులానికైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి.TTD: తితిదే అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన

Last Updated : Jul 12, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details