అమరావతి కోసం గుంటూరులో బైక్‌ర్యాలీ - bike rally in guntur dst
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని గుంటూరులో తెదేపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి అంటూ నినదించారు. గుజ్జనగుండ్ల ప్రాంతం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకూ ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి అమరావతినే రాజధినగా కొనసాగిస్తాం అనేవరకూ తాము నిరసనలు చేస్తూనే ఉంటాం అని తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్చార్జీ రవీంద్ర స్పష్టం చేశారు.