లోకేశ్, నారాయణ బైక్ ర్యాలీ
రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మంగళగిరిలో రాజకీయ ఐకాస నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ,సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. త్వరలో రాజధాని అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని లోకేశ్ తెలిపారు. భూముల్చిన రైతులను ప్రభుత్వం ముంచేసిందని ఆయన విమర్శించారు
గుంటూరు జిల్లా పెదనందిపాడులో తాగునీటి చెరువులో ఏర్పాటు చేసిన తెప్పపై ప్లకార్డులు పట్టుకుని నిరసకారులు ఆందోళన చేశారు. ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో రైతులు, తెదేపా నాయకులు రిలే నిరాహాకదీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని గుంటూరు పశ్చిమంలో మాట్లాడిన తెదేపా నేత నక్కాఆనందబాబు మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా ప్రకటించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వినుకొండ పట్టణంలో తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
.
ఇదీచూడండి