రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు విన్నవించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, 2013 ఎన్నికలకు ముందు ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులతో రిజర్వేషన్ మొత్తాన్ని 50 శాతానికి కుదించిందన్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 60.5శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించటం జరిగిందని గుర్తు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గతంలో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
'బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి' - గుంటూరు జిల్లా
రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు విన్నవించారు.
బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి