కేంద్ర ప్రభుత్వం 30 సంవత్సరాల నుంచి మండల కమిషన్ ను పక్కన బెట్టి బీసీలకు అన్యాయం చేస్తోందని.. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు ఆరోపించారు. ఆగస్టు 7న హైదరాబాదులోని సరూర్ నగర్ లో జాతీయ ఓబీసీ మహా సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో 32 బీసీ కులసంఘాలతో ఆదివారం నిర్వహించిన బీసీ సదస్సులో ఈ విషయం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని... వెనుకబడిన కులాలన్నీ ఏకమై సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.
''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి'' - tenali
గుంటూరు జిల్లా తెనాలిలో 32 బీసీ కులసంఘాలతో బీసీ సదస్సు నిర్వహించారు. ఆగష్టు 7న హైదరాబాద్ సరూర్నగర్లో జాతీయ ఓబీసీ సదస్సు నిర్వహిస్తున్నట్టు నేతలు తెలిపారు.
బీసీ సమావేశం