అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవకుడిగా పనిచేసి.. అభివృద్ధికి కృషి చేసినట్లు తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. నూతన సంవత్సరం వేళ ఆనందంగా గడపాల్సిన సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే బాధగా ఉందని ఆవేదన చెందారు. అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఆందోళన చేస్తున్న రైతులను.. సతీమణి భువనేశ్వరి తోడుగా కలిశారు. రైతుల ఆవేదన చూసే... ఈ ఏడాది వేడుకలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రాణ సమానంగా చూసుకున్న భూములను రైతులు రాజధాని కోసం త్యాగం చేయడాన్ని.. ప్రస్తుత అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
విజన్ - 2020...హైదరాబాద్ అభివృద్ధి