తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోడెల మృతికి తెలుగుదేశం నేతలంతా రేపు, ఎల్లుండి సంతాపం ప్రకటించాలని నిర్ణయించారు. కోడెల మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫర్నిచర్ పేరుతో కోడెలను మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు పాల్పడేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితులు వైకాపా ప్రభుత్వం తెచ్చుకుంటుందని మండిపడ్డారు. పైగా ఆయన కుమారుడే హత్య చేసినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేయించిన హత్యేనంటూ ఆరోపించారు.
'కోడెలది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే' - టెలీకాన్ఫరెన్స్
తెదేపా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు : చంద్రబాబు
TAGGED:
టెలీకాన్ఫరెన్స్