పసందైన కార్యక్రమాలు నిర్వహిస్తూ... శ్రోతలను ఆకట్టుకుంటున్న 'ఈఎఫ్ఎం' సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ నివారణపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. గుంటూరులోని బ్రాడిపేట, అరండల్ పేట, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఈఎఫ్ఎం బృందం పర్యటించింది. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టలను ప్రజలకు వివరించింది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు పెంచాలని సూచించింది. వివిధ రకాల మొక్కలు ఉచితంగా పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇళ్లలో ఉపయోగించే ప్లాస్టిక్ సీసాలు, కవర్లను ఈఎఫ్ఎం బృందానికి ఇచ్చి... మొక్కలు తీసుకున్నారు. తప్పనిసరిగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని నగరవాసులు ప్రతిజ్ఞ చేశారు. ఈఎఫ్ఎం చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.